స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:54 PM
సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్ పరిధిలోని ఓటర్లు స్వేచ్ఛగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
సిరిసిల్ల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్ పరిధిలోని ఓటర్లు స్వేచ్ఛగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్ల, వేములవాడలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా సిరిసిల్ల గీతానగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వేములవాడ ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూ షన్ కేంద్రాల్లో ఇన్‌చార్జి కలెక్టర్‌తో పాటు జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి తీసుకున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఎస్‌ఈసీ నిబంధనలకు మేరకు విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్‌లు చెక్ చేసుకో వాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో 100 మీటర్ల వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని తెలిపారు. దివ్యాంగులకు ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం కల్పించామని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓటర్లు అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్ అకౌంట్, పీవో డైరీ రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించాలని వివరించారు. ఈనెల 13వ తేదీన సిరిసిల్ల, వేములవాడ సినారే కళామందిర్ భవనల్లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39వార్డులు, వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉన్నాయని, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 117, వేములవాడ మున్సిపల్ పరిధిలో 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో 1.22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 15మంది రిటర్నింగ్ అధికారులు, వేముల వాడ మున్సిపల్ పరిధిలో 12 మంది రిటర్నింగ్ అధికారులు, ఇతర ప్రిసైడింగ్, ఏపీవోలు, ఓపీవోలను నియమించామని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుండి, ఓటరు గుర్తింపు కార్డు కాకుండా ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలలో దేనినైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి తమ ఓటు హక్కును వినియోగిం చుకోవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు వెంకటే శ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్, అధికా రులు జగన్ మోహన్‌రెడ్డి, శ్రీనివాసాచారి, భారతి, అన్సార్, మీర్జా ఫస హత్ అలీ బేగ్ తదితరులు ఉన్నారు.