పూల జాతరకు సర్వం సిద్ధం..
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:57 PM
సద్దుల బతుకమ్మ సందర్భంగా వేములవాడ భీమన్నఆలయంలో ఈవో రమాదేవి ఆధ్వ ర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
వేములవాడ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): సద్దుల బతుకమ్మ సందర్భంగా వేములవాడ భీమన్నఆలయంలో ఈవో రమాదేవి ఆధ్వ ర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భీమేశ్వర సదన్‌లో బతుకమ్మ ఆడేం దుకు ఆలయ ఆవరణను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పట్ట ణంలోని మూలవాగు తీరంలోని బతుకమ్మ తెప్ప వద్ద వేడుకలు నిర్వహించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. చైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో అన్ని వార్డులతో పాటు మూలవాగు బతు కమ్మ తెప్ప వద్ద వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో మూలవాగు, భీమన్న ఆలయానికి తరలివచ్చి బతుకమ్మ తెప్ప వద్ద బతుకమ్మ ఆడుకుంటారు. పట్టణంలో రూ.36 లక్షల నిధు లతో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ పాలక వర్గం వెల్లడించింది. సుభాష్‌నగర్ రోడ్డు నుంచి, బైపాస్ రోడ్ల నుంచి మహిళలు బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉం డటంతో ఎస్పీ మహేష్ బీ గితే ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసు లు, టౌన్ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బారికేడ్లు ఏర్పా టు చేస్తున్నారు. భారీగా ప్రజలు తరలిరానుండటంతో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చినట్లు ఎస్పీ ఆదేశాలతో టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మూలవాగులోని బతుకమ్మ తెప్ప సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కోరుట్లకు వెళ్లే వాహనాలు మహంకాళి ఆలయం నుంచి బయలుదేరి మున్నూరు కాపు సత్రం, పెద్దమ్మ ఆలయం, చెక్కపల్లి బస్టాండు, కోరుట్ల బస్టాండు మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ఆహ్వానం..
వేములవాడలో శుక్రవారం జరిగే బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మున్సిపల్ పాలకవర్గం ఆహ్వాన పత్రికను అందజేశారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ నగేష్‌లను ఆహ్వానించారు. బీఆర్ఎస్ నియో జకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, పద్మా దేవేందర్‌రెడ్డి, గొంగడి సునీత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బహుజన బతుకమ్మ రాష్ట్ర కన్వీనర్ విమలక్క బతుకమ్మ సంబరాలకు హాజరుకానున్నారు.