నాగుల పంచమికి సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:52 AM
శ్రావ ణమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండు గల్లో ఒకటైన నాగుల పంచమిని ఈ ఏడాది భక్తిశ్రద్ధలతో జరుకునేందుకు భక్తులు సిద్ధమ య్యారు.
వేములవాడ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): శ్రావ ణమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండు గల్లో ఒకటైన నాగుల పంచమిని ఈ ఏడాది భక్తిశ్రద్ధలతో జరుకునేందుకు భక్తులు సిద్ధమ య్యారు. హిందూ సంప్రదాయాం ప్రకారం నాగ దేవతలను పూజిస్తూ సర్ప దోషాలు తొలగి, సంతానం కలుగుతుందని, కుటుంబంలో ఐక్యత పెరుగు తుందని ప్రజలు విశ్వసిస్తారు. అన్నదాతలకు పంటలను నాశనం చేసే ఎలుకలను నాగులు తినడం వల్ల రైతులకు కూడా ఇది కృతజ్ఞతగా నాగదేవతలకు పాలతో అభిషేకం, పుట్టలో పాలు పోయడం వంటివి చేస్తారు. ఉదయాన్నే మహిళలు తలంటు స్నానం చేసి, పసుపు, కుంకుమ, పూలు, పాలు, గుడ్లు, పసుపు నీళ్లతో పుట్టల వద్ద పూజలు చేసే పద్ధతి ఆనవాయితీగా కొనసాగుతోంది.
నాగేంద్ర స్వామి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు
ఈ సంవత్సరం నాగుల పంచమి శ్రావణ సోమవారం రావడంతో శివాలయాల్లో, నాగాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. వేములవాడ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో నాగేంద్ర స్వామికి క్షీరాభిషేకం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. శ్రావణ సోమవారం భక్తుల రద్దీతో పాటుగా పట్టణానికి చెందిన మహిళలు భీమన్న ఆలయా నికి వచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఇబ్బందులు తలేత్తకుండ రాజన్న ఆలయ ఈవో రమాదేవి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. భీమన్న భక్తులకు ఇబ్బందులు లేకుండా పట్టణంలోని చాణక్య ఆసుపత్రి ఎదురుగా ఉన్న దారి నుంచి ఆలయ పడమర ద్వారం ద్వారా భక్తులు లోపలికి ప్రవేశించి నాగేంద్రస్వామి వారికి అభిషేకం చేసు కునేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్‌లను ఏర్పాటు చేశారు. పటిష్ఠ పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షించను న్నట్లు తెలిపారు.