ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:13 AM
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌వో) సత్యనారాయణ అన్నారు.
కరీంనగర్ క్రైం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌వో) సత్యనారాయణ అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై కరీంనగర్ డీర్ పార్క్‌లో సందర్శకులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ... ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందన్నారు. డీర్‌పార్క్‌లోనికి ప్లాస్టిక్ వస్తువులు అనుమతించడం లేదని తెలిపారు. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వస్తువులు అయిన వాటర్ బాటిల్‌కు 50, కవర్లకు 20 రూపాయలు డిపాజిట్ తీసుకుంటున్నామన్నారు. సందర్శకులు తిరిగి వెళ్లే క్రమంలో గేటు వద్ద ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు చూపించి వారు డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి పొందాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులను డీర్‌పార్క్ వద్ద ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్‌లో వేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ ఈ నిబంధనను అతిక్రమిస్తే 500 రూపాయలు, అంతకుపైన జరిమానా విధించనున్నట్లు డీఎఫ్‌వో తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో షేక్ షౌకత్ హుస్సేన్, డీఆర్వో ఏ ఆనంద్‌కుమార్, సందర్శకులు, సిబ్బంది పాల్గొన్నారు.