ప్రతి ఒక్కరూ దేశ సమగ్రతకు పాటుపడాలి
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:19 AM
దేశ సమగ్రత, ఐక్యతకు ప్రతి ఒక్క రూ పాటుపడాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు పేర్కొన్నారు. శనివారం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పూలమాలలు, జ్యోతి ప్రజ్వలన చేశారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
పెద్దపల్లి, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): దేశ సమగ్రత, ఐక్యతకు ప్రతి ఒక్క రూ పాటుపడాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు పేర్కొన్నారు. శనివారం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పూలమాలలు, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన మాట్లాడు తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున జాతీయ ఐక్యతా దినో త్సవాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు సమైక్యత, ఐకమత్యంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యోగులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్ పాలనా అధికారి ప్రకాష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ కమిషనరేట్‌లో
కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరిం చుకుని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. సీపీ అంబర్ కిశోర్ ఝా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేం దుకు అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సీపీ మాట్లా డుతూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ జీవితం, నాయకత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలోని 565 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి అఖండ భారత నిర్మాణంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కే శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీ రవీందర్, ఏఆర్ ఏసీపీప్రతాప్, ఏఓ శ్రీనివాస్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ గోపి, ఆర్‌ఐ పాల్గొన్నారు.