ఓటు ప్రాధాన్యం ప్రతి ఒక్కరూ గుర్తించాలి
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:55 PM
ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
కరీంనగర్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, అధికారులు, కార్యాలయ ఉద్యోగులతో కలెక్టర్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతోపాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.