Share News

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:48 AM

ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని డీఆర్‌డీఏ పీడీ ఎం గీత పిలుపునిచ్చారు.

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి

తిమ్మాపూర్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని డీఆర్‌డీఏ పీడీ ఎం గీత పిలుపునిచ్చారు. మండలంలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 41.54 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇంటింటికి ఇప్పటి వరకు 8.32 లక్షల మొక్కలను పంపిణీ చేశామని, మొత్తం 13.69లక్షల మొక్కల నాటే పనులు పూర్తి అయ్యాయన్నారు. జిల్లాలోని 316 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం మరో 11.5 లక్షల మొక్కలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో నిర్ధేశిత లక్ష్యాలను పూర్తిచేసి మొక్కలను సంరక్షించేలా పంచాయితీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజీవ్‌ మల్హోత్రా, సర్పంచ్‌ ఆవుదుర్తి రాంకిషన్‌, ఉప సర్పంచ్‌ ఫణిత్‌, ఏపీవో చంద్రశేఖర్‌, పంచాయితీ కార్యదర్శి రమాదేవి, టీఏ హరిష్‌, మెట్‌ కవ్వంపల్లి అరుణ, వీఏవో సంధ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:48 AM