అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:36 AM
వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అదనపు ఎస్పీ శేషా ద్రినిరెడ్డి సూచించారు.
-అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి
జగిత్యాల టౌన్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అదనపు ఎస్పీ శేషా ద్రినిరెడ్డి సూచించారు. వాహనాల వేగాన్ని నియంత్రిం చినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించ వ చ్చని ఆమె అన్నారు. రోడ్డు భద్ర త మాసోత్సవాల ముగింపు సంద ర్భంగా శనివారం జగిత్యాల పట్ట ణంలోని తాహసీల్ చౌరస్తాలో పోలీస్‌శాఖ, లయన్స్ క్లబ్ సంయు క్త ఆధ్వర్యంలో 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణి చేశారు. అనంతరం ట్రాఫిక్ నియయాలు, హెల్మెట్ విని యోగంపై నిర్వహించిన బైక్ ర్యాలీని అదనపు ఎస్పీ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో డీజీపీ ఆదేశాల మేరకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్, అలైవ్ పేరుతో తెలంగాణలో సురక్షితమైన ప్రయాణాలు చేయాలని ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలి పారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, డీటీవో శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశం, యంవీఐ వెంకన్న, ఏయంవీఐ అభిలాష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.