Share News

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:13 AM

రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఇన్‌ చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

సిరిసిల్ల, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఇన్‌ చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గురువారం తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో రవాణా శాఖ ఆధ్వ ర్యంలో డైవ్రర్లు, స్కూల్‌ విద్యార్థులకు అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఇన్‌చార్జి కలె క్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి గీతే హాజర య్యారు. ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారఽథి కళాకారులు రోడ్డు భద్రతా.. బాధ్యత.. ప్రమాదాల నివా రణపై పాటలు ఆలపించి అవగాహన కల్పించారు. అధి కారులు, డ్రైవర్లు, స్కూల్‌ విద్యార్థులు రహదారి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ దేశంలో గత ఏడాది 4.80 లక్షల ప్రమా దాలు జరిగాయని, దానిలో 1.70లక్షల మంది ప్రాణాలు కోల్పోఁయారని తెలిపారు. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మృతిచెందుతున్నారని వివరించారు. జిల్లాలో గత ఏడాది 268ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మొదట బాధితులు డ్రైవర్లేననీ, ప్రతి డ్రైవర్‌ రోజు వాహన భద్రత ప్రతిజ్ఞ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. తమ కుటుంబ, పిల్ల ల బాధ్యతను గుర్తుపెట్టుకొని జాగ్రతగా వెళ్లాలన్నారు. రోడ్డు ప్రమాదంతో డ్రైవర్‌ తోపాటు ఎదుటివారి జీవితా లు ఇబ్బందుల్లో పడతాయని తెలిపారు. అందరూ తప్ప నిసరిగా ట్రాఫిక్‌రూల్స్‌ పాటిస్తూ వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులతో మర్యాదగా ఉండాలని సూచించారు. ప్రతినెలా రోడ్డు సేఫ్టీకమిటీ మీటింగ్‌ ఆర్‌ అండ్‌బీ, పీఆర్‌, పోలీస్‌, రవాణా శాఖా, ఆర్టీసీ అధికారు లతో సమావేశం పెడుతున్నామని, బ్లాక్‌స్పాట్స్‌ గుర్తింపు, నివారణ చర్యలు, సైన్‌ బోర్డ్స్‌ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డుప్రమాదాలు పూర్తి గా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు.

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌ అమలు చేస్తాం

హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి పెట్రోల్‌ పోయవద్దనే ఆదేశాలు ఇస్తామని, నోహెల్మెట్‌.. నో పెట్రోల్‌ అమలుచేస్తామని కలెక్టర్‌ తెలిపారు. అందు బాటు ధరలో ఉండే హెల్మెట్‌ ప్రతి ద్విచక్ర వాహనదా రుడు తీసుకోవాలని, వాహనం ఎక్కినప్పటినుంచి కింద కు దిగేవరకు సెల్‌ఫోన్‌ వినియోగించవద్దని వాహనదా రులకు సూచించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకవెళ్లి ప్రాణాలు కాపాడే వారికి ప్రభు త్వం రహవీర్‌ గుడ్‌ సామ్రతాన్‌ కింద రూ.25వేల సహా యాన్ని అందిస్తుందని, రోడ్డుప్రమాద బాధితులకు ఆసు పత్రిలో రూ.1.50లక్షల వరకు వైద్యం పొందే సదుపా యం ఉందని వెల్లడించారు.

డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ వాడొద్దు..

డ్రైవింగ్‌ చేసేటప్పుడు ప్రతి డైవ్రర్‌ ఫోన్‌ వినియోగిం చవద్దని ఎస్పీ మహేష్‌ బీ గితే సూచించారు. అపరిచిత డ్రైవర్లు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరా రు. స్కూల్‌ ఆటోలు, బస్సుల్లో పరిమితికి మించి విద్యా ర్థులను తరలించవద్దన్నారు. ఎక్కువ ప్రమాదాలు డ్రంకె న్‌డ్రైవ్‌తోనే అవుతున్నాయని తెలిపారు. సెల్‌ఫోన్‌ మా ట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. మైనర్లు వాహనాలు నడపవద్దని ఒకవేళ నడిపి పట్టుబ డితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డుభద్రత చర్యలు పకడ్బందీగా తీసు కోవడంతో గత ఏడాదితో పోలిస్తే 40శాతం ప్రమాదాలు తగ్గాయని వెల్లడించారు. అసలు ప్రమాదాలే జరవద్దని ఆకాంక్షించారు. త్రిబుల్‌ రైడింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ చేయవద్దని సూచించారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్ర త్యేక చొరవతో ప్రతినెలా రోడ్‌ సేఫ్టీ మీటింగ్‌ పెడుతు న్నారని, బ్లాక్‌స్పాట్స్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటు న్నారని, రోడ్డుపైకి వచ్చే చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర భద్రత చర్యలు చేపడుతున్నారని సిరిసిల్ల, వేములవాడ డిపో మేనేజర్లు కొనియాడారు.

‘టైడ్స్‌’ పరిశీలన..

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌స్కిల్స్‌(టైడ్స్‌)ను ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బీ గితే కలిసి పరిశీలించారు. ఈ సంద ర్బంగా సిమ్యులేటర్‌పై ఎస్పీ కూర్చుని దాని వినియోగం తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా రవాణా శాఖా అధికారి లక్ష్మన్‌, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్‌, ఆర్‌అండ్‌ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, సిరిసిల్ల, వేములవాడ డిపో మేనేజర్లు ప్రకాశ్‌ రావు, శ్రీనివాస్‌, ఎంవీఐ వంశీధర్‌, ఏఎంవీఐలు రజనీ దేవి, పృధ్వీరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 12:14 AM