ప్రతి ఒక్కరికి 125 రోజుల పని కల్పించాలి
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:19 AM
గ్రామాల్లో ప్రతి ఒక్కరి కి ఏటా 125 రోజులు పనికల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
తంగళ్లపల్లి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రతి ఒక్కరి కి ఏటా 125 రోజులు పనికల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. అలాగే తంగళ్లపల్లి మండలంలో అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద మంజూరైన రూ.25లక్షలతో అంతర్గత సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే గ్రామ కూడలిలో బీజేవైఏం జిల్లా అధ్యక్షుడు, సర్పంచ్ రాగుల రాజిరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసి న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనం తరం విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జాతీయ ఉపాధిహామీ పథకం కింద గత ఏడాది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రూ.32.13 కోట్లు ఖర్చు చేసి రోడ్లను నిర్మించామన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లు అభివృద్ధి పనులకు వెచ్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌లో జాతీయ ఉపాధిహామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ పథకానికి రూ.95,692 కోట్లు కేటాయించామన్నారు. ఈ పథకం కింద తెలంగాణకు రూ.3వేల కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏటా 125 రోజుల పని దినాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకోవచ్చామని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆశించిన విధంగా పనిదినాలు కల్పించడంలో విఫలమవుతోం దని విమర్శించారు. జిల్లాలో 92వేల జాబ్ కార్డులు ఉంటే సగటున 50 రోజులలోపు మాత్రమే పని దినాలు కల్పిస్తున్నారన్నారు. 6వేల లోపు కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిదినాలు కల్పించారన్నారు. ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమ లుచేయాలని అధికారులను కోరారు. నోటికి వచ్చినట్లు మాట్లడడం కాదు, మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల సంగతి ఏమిటని ముఖ్యమంత్రి రేవంతర్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అభివృద్ధికి పైసా ఇవ్వని రాష్ట్ర ప్రభు త్వం కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆరు గ్యారంటీలను అమలుచేయకుండా ప్రజలను దారి మళ్లిస్తున్నారని విమ ర్శించారు. కార్యక్రమల్లో అదనపు కలెక్టర్ నాగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షు డు రెడ్డబోయిన గోపి, బీజేపీ నాయకులు చెన్నమనేని వికాస్‌రావు, మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.