Share News

వాహనాలతో పాటు ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయాలి

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:13 AM

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండి వాహనాలతో పాటు ప్రతి ఒక్కరిని తనిఖీలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా మున్సిపల్‌ ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డిలు అదేశించారు.

వాహనాలతో పాటు ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండి వాహనాలతో పాటు ప్రతి ఒక్కరిని తనిఖీలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా మున్సిపల్‌ ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డిలు అదేశించారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని రగుడులో ఏర్పాటుచేసిన ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్ట్‌ను శుక్రవారం ఎన్నికల అధికారులతో కలిసి జిల్లా అద నపు కలెక్టర్‌ నగేష్‌, జిల్లా మున్సిపల్‌ సాధారణ వ్యయ పరిశీలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డిలు తనిఖీలు చేసి తనిఖీలుచేసి నమోదు చేసిన వివిధ రిజిస్టర్‌లను పరిశీలించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్‌ కమిషనర్‌లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్‌, నోడల్‌ అఽధికారులు నవీన్‌కుమార్‌, ఏంఏ భారతి, శ్రీనివాసచారి, తహసీ ల్దార్‌లు మహేష్‌ కుమార్‌, జయంత్‌, అన్సారీ, మీర్జాఫసహత్‌ అలీ బేగ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 12:13 AM