ప్రతీ ఒక్కరు ఓటు హక్కును కాపాడుకోవాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:47 PM
ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది చాలా కీలకమని, ఓటును కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది చాలా కీలకమని, ఓటును కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు కొత్త పేర్లు నమోదు, తప్పుల సవరణ కోసం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో వార్డులో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటుచేయగా మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ హెల్ప్ డెస్క్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు కొత్త పేర్లు నమోదు, తప్పుల సవరణ కోసం బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌వో) నిర్వహి స్తున్న ఇంటింటి సర్వేను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బూత్ లెవల్ అధికారులకు ఈనెల 18లోపు ఓటర్లు సరైన సమాచారం అందించి ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, సర్ సూపర్‌వైజర్స్ సబ్బని వేణు, బొప్ప దేవయ్య, నాయకులు ఇప్పపుల్ల లక్ష్మణ్, కంసాల మల్లేశం, అలవాల సత్యనారాయణ పాల్గొన్నారు.