Share News

ప్రతి విద్యార్థి లక్ష్యం చేరుకోవాలి

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:15 AM

ప్రభుత్వం కల్పిస్తు న్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని.. తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆకాంక్షించా రు.

ప్రతి విద్యార్థి లక్ష్యం చేరుకోవాలి

వేములవాడ రూరల్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కల్పిస్తు న్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని.. తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆకాంక్షించా రు. వేములవాడ రూరల్‌ మండలం మర్రిపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో గురువారం యూనిఫాంల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని స్టోర్‌ రూమ్‌లో బియ్యం, కూరగా యలు, పండ్లు, నెయ్యి, ఇతర పదార్థాల నాణ్యత, గడువు తేదీని తనిఖీ చేశారు. మెనూ చార్ట్‌ను పరిశీలించి.. ఏయే ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు. విద్యాలయంలో చదివి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు ప్రస్తుతం ఎక్కడ చదువుతున్నారో ఆరా తీశారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని.. దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని పిలుపుని చ్చారు. రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో ప్రవేశానికి చాలా మంది పోటీ పడతారని, ఇక్కడ చదివే మంచి అవకాశం విద్యార్థులకు వచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థులు రోజు ఆటలు ఆడాలని.. మంచిగా చదవాలని సూచించారు. చదువు మధ్యలో మానేయవద్దని, ఉన్నత విద్యాబ్యాసం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. అప్పుడే మహిళ సాధికారత సాధ్యమని తెలిపారు. విద్యార్థులకు మహిళా సంఘాలవారితో యూనిఫాంలు కుట్టి స్తున్నామని, వారికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ప్రతి రెసిడెన్షి యల్‌ విద్యాలయాల్లో తనిఖీ కోసం ఒక మండల, జిల్లా స్థాయి అధికా రులను కేటాయించామని వివరించారు. వారు విద్యాలయం తనిఖీ చేసి.. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో మొండయ్య, డీఆర్‌ డీవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్‌ అబూబాకర్‌, ఎంపీడీఓ శ్రీనివాస్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:15 AM