Share News

గడువు ముగిసినా అక్కడే..

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:54 PM

వేములవాడలో సబ్‌ రిజిస్ట్రార్‌, ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయాలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతు న్నాయి.

గడువు ముగిసినా అక్కడే..

వేములవాడ టౌన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): వేములవాడలో సబ్‌ రిజిస్ట్రార్‌, ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయాలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతు న్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను అద్దె భవనాల నుంచి వెంటనే ఖాళీ చేయా లని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు డిసెంబరు 31వరకు గడువు విధించా రు. ఈ గడువు ముగిసినప్పటికీ వేములవాడలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎక్సైజ్‌ కార్యాలయం మారలేదు. వేములవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాల యానికి దాదాపు 120 గ్రామాల ప్రజలు వస్తుం టారు. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్‌ కాలనీ సమీపంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుంది. ఇందుకు ప్రతి నెల రూ.4850 అద్దె చెల్లిస్తున్నారు. ఇరుకైనా అద్దెభవనంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉంది. ఈ భవనంలో వెళుతురు ఉండదు. కూర్చుండేం దుకు ఫర్నిచర్‌ లేదు. మరుగుదొడ్లు లేవు. పా ర్కింగ్‌ అసలేలేదు. దీంతో రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. రహ దారులపై వాహనాలు పార్కింగ్‌ చేయడంతో ఇబ్బందులు నెలకొన్నాయి. మరోవైపు వేముల వాడ పట్టణంలోని పాత కూరగాయల మార్కె ట్‌లో గల అద్దె భవనంలో ఎక్సైజ్‌ కార్యాలయం కొనసాగుతుంది. ఇందుకు ప్రతినెల అద్దె రూ. 5500 చెల్లిస్తున్నారు. ఎక్సైజ్‌ స్టేషన్‌కు వెళ్లలాంటే ఇరుకైన రహదారులతో వాహనదారులు ఇబ్బం దులు పడాల్సిందే. ఇటీవల సీఎం అద్దె భవనా ల్లో ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యా లయం, ఎక్సైజ్‌ కార్యాలయంలు మారనున్నాయి. అయితే ఎక్కడికి మారుతాయనేది ప్రశ్నార్థక మైంది. వేములవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం మార్చేందుకు ఇప్పటివరకు శ్యామకుంటలోని ఇంటిగ్రేటెడ్‌ విజిటెబుల్‌ మార్కెట్‌, మార్కెట్‌ యార్డులోని రైతు విశ్రాంతి భవనం, చింతల్‌ఠా ణాలోని కమ్యూనిటీ భవనం, పీహెచ్‌సీ, ఐకేపీ భవనం తదితర ప్రభుత్వ భవనాలను పరిశీలిం చారు. వీటిలో పీహెచ్‌సీ ఆర్డీవో కార్యాలయానికి వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇంటిగ్రే టెడ్‌ విజిటెబుల్‌మార్కెట్‌ మున్సిపల్‌ అద్దె చెల్లిం చాల్సి వస్తుండడంతో వినియోగించుకునే పరిస్థి తిలేదు. మిగిలిన రైతు విశ్రాంతిభవనం, కమ్యూ నిటీ భవనం, ఐకేపీ భవనం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యా లయానికి అనువుగా ఉన్నాయి. ఇకపోతే ఎక్సైజ్‌ స్టేషన్‌ను ఎక్కడి మార్చాలో తెలియని పరిస్థితి నెలకొంది. అద్దెభవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాల యాలను మార్చాలనే గడువు ముగిసినప్పటికీ అనువైన భవనాల కోసం అన్వేషణ సాగుతోంది.

Updated Date - Jan 18 , 2026 | 11:54 PM