డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:29 AM
డ్రగ్స్ నిర్మూలన సమాజంలో అందరి బాధ్యత అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన, జూన 13 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ నిర్మూలన సమాజంలో అందరి బాధ్యత అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఇండియన మెడికల్ అసోసియేషన(ఐఎంఏ) ఆధ్వర్యంలో ఈనెల 26 నిర్వహించనున్న యాంటీ డ్రగ్ 3కే రన కరపత్రాన్ని శనివారం ఐఎంఏ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూమాదకద్రవ్యాల వ్యసనం దేశ భవిష్యతకు తీవ్రమైన ముప్పుగా పరిమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగంపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు ఐఎంఏ చేపట్టిన కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహించేందుకు వైద్యులు ముందుకు రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
రన సా్ట్రంగ్-లీవ్ ప్రీ, సే నోటు డ్రగ్స్ అనే నినాదంతో నిర్వహించనున్న 3కే రన పాత బస్టాండ్ దగ్గరలోని వివేకానందా మినీ స్టేడియం నుంచి ఐఎంఏ భవన వరకు జరగనున్నట్లు ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డాక్టర్ డాక్టర్ గూడూరి హేమంత తెలిపారు. విద్యార్థులు, యువత, వైద్యులు, ప్రజాప్రతినిధులు మరియు అన్నివర్గాల ప్రజలు పాల్గొని మాదక ద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని సమాజానికి చాటాలని పిలుపునిచ్చారు. ఐఎంఏ కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస రెడి ్డ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని, యువతను వ్యసనాల బారినపడకుండా కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం 3కే రన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ కోశాధికారి కోటగిరి సుధీర్ కుమార్, డాక్టర్ వడ్లూరి శ్రవణ్ కుమార్, డాక్టర్ బండెల విజయ్, డాక్టర్ ఇనుగురతి రాజశేఖర్ పాల్గొన్నారు.