Share News

మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:31 AM

మాద కద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగ స్వాములవ్వాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ అన్నా రు.

మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
మాట్లాడుతున్న ఎస్పీ అశోక్‌కుమార్‌

-ఎస్పీ అశోక్‌ కుమార్‌

రాయికల్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మాద కద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగ స్వాములవ్వాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ అన్నా రు. రాయికల్‌ మండల కేంద్రంలో ఆర్‌ఆర్‌ గార్డన్స్‌లో జిల్లా పోలీస్‌ శాఖ, రాయికల్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యా లకు బానిసలవడం వల్ల యువత భవిష్యత్‌ పూర్తిగా నాశనమవుతుందని హెచ్చరించారు. చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మక కార్యక్ర మాల్లో పాల్గొంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.మాదక ద్రవ్యా లను నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకర మైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాల నే లక్ష్యంగా జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్ర మాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

మాదక ద్రవ్యాల బారిన పడుతున్న యువ తను కాపాడేందుకు జిల్లా పోలీస్‌ శాఖ కృషి చేస్తుందని, అందులో భాగంగా విద్యా సంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చడం జరుగుతుందన్నారు. మత్తు పదార్థాల నివారణ కోసం యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్‌ కమిటీలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్‌ సోల్జర్‌లుగా సహకరించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి అవ గాహన పెంపొందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మేము డ్రగ్స్‌ తీసుకోము.. బంధు మిత్రులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా చూ సుకునే బాధ్యత మాదే.. డ్రగ్స్‌ వల్ల కలిగే అన ర్థాల గురించి వారికి అవగాహన కల్పిస్తా మ న్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషా ద్రి నిరెడ్డి, డీఎస్పీ రఘుచందర్‌, రూరల్‌ ఇన్‌ స్పె క్టర్‌ సుధాకర్‌, ఎస్సైలు సుధీర్‌రావు, గీత, కృష్ణ, ఎంఈవో శ్రీపతి రాఘవులు, తహసీల్దార్‌ నాగా ర్జున, జేఏసీ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌, కోశాధికారి మచ్చ శేఖర్‌,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 12:31 AM