సర్వ మతాలకు సమ ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:47 AM
కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ మతాల ను గౌరవించి సమ ప్రాధాన్యతను ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ మతాల ను గౌరవించి సమ ప్రాధాన్యతను ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సంగీ తం శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభు త్వం లౌకితత్వంతో ముందుకు సాగుతోందని అన్నారు. అన్ని మతాలను సోదరభావంతో మెదులుతూ వారి సంక్షేమానికి పాటుపడుతోందన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజన్నసిరిసిల్ల జిల్లాకు రూ.8.40 లక్షల నిధులను కేటాయించి మైనార్టీలపై చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. భవిష్యత్తులో అనేక సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సంగీతం శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గీతాంజలి, ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగం, ఉప సర్పంచ్ వెంకట్‌రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, గౌస్, సాహె బ్, శ్రీనివాస్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, శంకర్, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.