పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:00 AM
పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, ప్లాస్టిక్‌రహిత సమాజం కోసం ప్రతీఒక్కరు నడుం బింగించాలని మున్సిపల్ చైర్‌పర్సన సమిండ్ల వాణిశ్రీనివాస్ పిలుపునిచ్చారు.
మున్సిపల్ చైర్‌పర్సన సమిండ్ల వాణిశ్రీనివాస్
జగిత్యాల టౌన, జూన 12 (ఆంధ్రజ్యోతి) పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, ప్లాస్టిక్‌రహిత సమాజం కోసం ప్రతీఒక్కరు నడుం బింగించాలని మున్సిపల్ చైర్‌పర్సన సమిండ్ల వాణిశ్రీనివాస్ పిలుపునిచ్చారు. మున్సిపల్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో వీధి వ్యాపారులకు, పండ్ల వ్యాపారులకు ఉచితంగా జ్యూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన మాట్లాడుతూ సమాజంలో ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక నష్టాలు జరుగుతాయన్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు తలుచుకుంటే మన పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చే అవకాశం ఉందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి వారు అందిస్తున్న క్లాత, జ్యూట్ బ్యాగులను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కస్టమర్లకు ప్లాస్టిక్ కవర్లను ఇవ్వడం మానేస్తే వారు తప్పకుండ ఇంటి నుంచే బ్యాగులు తెచ్చుకుంటారని సూచించారు. వ్యాపారులను ఇబ్బంది పెట్టడం మున్సిపల్ ఉద్దేశం కాదని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా వ్యాపారులు మున్సిపల్ అధికారులకు సహకారం అందించాలని కోరారు. ఫుట్ పాతలను ఆక్రమించి షెడ్డులు వేయకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పిస్తూ జ్యూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. జగిత్యాలను ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు వ్యాపార కమిటీలు, అసోసియేషనలు, మున్సిపాలిటీలతో బాగస్వామ్యం కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి నోడల్ ఆపీసర్ మహేష్, ఎన్విరాల్‌మెంట్ ఇంజనీర్ శ్రీకాంత, చందు, పట్టణ వీధి వ్యాపారులు పాల్గొన్నారు.