పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:52 PM
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధత అని, భవిష్యత తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ సూచించారు.
కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల టౌన, జూన 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధత అని, భవిష్యత తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దితోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని గనపార్క్‌లో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. మొక్కల పెంపకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు దయాల చంద్రకళ శంకర్, బోయినపెల్లి ప్రశాంతరావు, వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, కమాలోద్దిన, అధికారలు తదితరులు పాల్గొన్నారు.
- పోలీస్ ప్రధాన కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ అశోక్ కుమార్ మొక్కలు నాటారు. పోలీస్ శాఖ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వివిధ సందర్బాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన నితిన, డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, ఇనస్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.