పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:16 AM
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తూ సహకరించాలని మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తూ సహకరించాలని మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్ అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్య క్రమంలో భాగంగా సోమవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10, 34వ వార్డుతో పాటు పలు వార్డుల్లో సభలను నిర్వహించారు. వార్డుల్లో సమస్యలను ప్రజలు మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదీర్‌పాషా దృష్టికి తెసుకెళ్లారు. మరికొందరు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి వైస్‌చైర్మన్ దార్ల సందీప్ మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ మధ్య నూతన గైడెన్స్ ఇచ్చిందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై చెత్త వేసే వారిపై చర్యలు తీసు కోవాలని సూచించిందన్నారు. మహిళలు, బాలికలకు రక్షణకు షీటీంలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ నాగుల కావ్య ఎల్లంతోపాటు, కౌన్సిలర్లు, మున్సి పల్ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.