అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:42 AM
మహాశివరాత్రి జాతర సందర్భంగా వే ములవాడ దేవాలయం వద్ద శివార్చన వేదికపై శనివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్య క్రమాలు ఆకట్టుకున్నాయి.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 14 (ఆంధ్ర జ్యోతి) : మహాశివరాత్రి జాతర సందర్భంగా వే ములవాడ దేవాలయం వద్ద శివార్చన వేదికపై శనివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్య క్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గీతే తో కలిసి ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, డోలు, డప్పు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్ర మాలను ఇన్‌చార్జి కలెక్టర్, ఎస్పీలు, భక్తులు తిల కించారు. ఈ ఉత్సవాల్లో అదనపు కలెక్టర్ నగేష్, ఈవో రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్‌లు
మహాశివరాత్రి జాతర సందర్భంగా వేముల వాడ భీమేశ్వరస్వామి దర్శనానికి వచ్చే దివ్యాం గులు, వృద్దుల కోసం వీల్‌చైర్‌లు అందుబాటు లోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి బేబీ ఫిడింగ్ సెంటర్‌ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. అంతకుముం దు బేబీ ఫీడింగ్ సెంటర్‌ను ఆమె ప్రారంభిం చారు. బేబీ ఫిడింగ్ గదుల్లో పరిశుభ్రమైన వాతా వరణం, గోప్యత, కూర్చునే సదుపాయాలు కల్పిం చారు. తల్లులు ప్రశాంతంగా పిల్లలకు ఫిడింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దివ్యాంగులు, వృద్ధులకు 100 వీల్‌చైర్‌లు అందుబాటులో ఉంచి ప్రత్యేక సహాయకులను ఏర్పాటు చేశారు. అవస రమైన చోట సూచిక బోర్డులు, 10 హెల్‌డెస్క్‌లు, 24 గంటలు పారిశుధ్య నిర్వహణ, వైద్య శిభిరం, కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ, అనంతరం క్యూలైన్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశా మని ఆమె తెలిపారు. ప్రతి చోట జిల్లా అధికారి ని ఇన్‌చార్జిగా నియమించారు. జాతర పరిసర ప్రాంతాల్లో 10 హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దర్శనం, పారిశుధ్యం, భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.