సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:50 AM
ప్రజాప్రతినిధులు, అధికా రులు సమన్వయంతో పనిచేసి ప్రభు త్వం అమలుచేస్తున్న సంక్షేమ పథ కాలు అర్హులకు అందేలా చూడాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచిం చారు.
ఇల్లంతకుంట, జూలై 29 (ఆంధ్ర జ్యోతి) : ప్రజాప్రతినిధులు, అధికా రులు సమన్వయంతో పనిచేసి ప్రభు త్వం అమలుచేస్తున్న సంక్షేమ పథ కాలు అర్హులకు అందేలా చూడాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచిం చారు. మండలపరిషత్ కార్యాలయం లో బుధవారం మండల అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం కొనసాగు తోందన్నారు. రైతులకు పెట్టుబడి సాయంతోపాటు అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేశామన్నారు. గత ప్రభుత్వం నిరుపేదల ఇళ్ల నిర్మాణాలను విస్మరించిందన్నారు. అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయని, రెండో విడత కోసం అధికారులు కసరత్తులు చేస్తు న్నారని తెలిపారు. ఉచిత ఆర్టీసీ బస్సుతో మహిళ లు సంతోషంగా ఉన్నారన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందాలని అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. మండలంలో అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపా రు. సమావేశంలో జడ్పీసీఈవో వెంకటమాధవవరా వు, మండలప్రత్యేకాధికారి రాయకృష్ణ, తహసీల్దార్ రాచకట్ల సురేష్, ఎంపీడీవో శశికళ, డీఈ పావణి, సర్పంచులు భాస్కర్‌రెడ్డి, మామిడి రాజు, నాయిని నవీన్‌కుమార్, కాథ మల్లేశం, భారతవ్వ, పండుగు సునిత, వొల్లాల రజిత, అరుకాల నవీన్‌కుమార్, చంద్రారెడ్డి, నేరెళ్ళ విజయ్, నవీన్‌రెడ్డి, మోహన్‌రా వు, భాస్కర్‌రెడ్డి, జుట్టు శేఖర్, నాగరాజులతోపాటు వివిదశాఖల అధికారులు పాల్గొన్నారు.