Share News

అర్హుల పేర్లు జాబితాలో ఉండేలా చూడాలి

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:03 AM

కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(సర్‌) ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీలో అర్హులైన ప్రతి ఓటరు పేరు ఉండేలా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

అర్హుల పేర్లు జాబితాలో ఉండేలా చూడాలి

ఎల్లారెడ్డిపేట, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(సర్‌) ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీలో అర్హులైన ప్రతి ఓటరు పేరు ఉండేలా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం ఆయన స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు వచ్చారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం (సర్‌)పై పలు సూచనలు చేశారు. అర్హత ఉన్న ఒక్క ఓటు తొలగింపునకు గురికాకుండా జాగ్రత్త పడాలన్నారు. ఫారాలను పూర్తి చేసి అందించేలా చూడాలని అన్నారు. కలిసిన వారిలో నాయకులు నర్సయ్య, లక్ష్మారెడ్డి, గౌస్‌, రాజిరెడ్డి, రాంరెడ్డి, గిరిధర్‌రెడ్డి, రాజేందర్‌, బాబు, శ్రీనివాస్‌, సత్యనారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 12:03 AM