కమనీయం.. వేణుగోపాలస్వామి కల్యాణం
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:51 PM
ఎల్లారెడ్డిపేటలోని వేణుగోపాలస్వామి ఆల యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఎల్లారెడ్డిపేట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డిపేటలోని వేణుగోపాలస్వామి ఆల యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో కీలక ఘట్టమైన స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆల యం నుంచి ఉత్సవమూర్తులను రథంపై ఊరే గించారు. ఉదయం 11 గంటల నుంచి వేద మంత్రోచ్ఛరణల మధ్య వేణుగోపాలస్వామి, రుక్మిణి, సత్యభామ కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర పర్యాటక అభి వృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యా దవ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ఏఎం సీ చైర్మన్ దేవానందం తదితరులు స్వామివారి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆశ్వినీ ఆసుపత్రి నిర్వాహకుడు వైద్యుడు సత్యనారాయణస్వామి సౌజన్యంతో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.