Share News

ఉపాధిహామీ పనులు ప్రాధాన్యంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - May 21 , 2026 | 12:52 AM

ఉపాధిహామీ పనులు అత్యంత ప్రాధాన్యంగా పూర్తిచేయాలని పంచాయతీరాజ్‌ ప్రత్యేక ప్రధానకార్యదర్శి దాన కిషోర్‌ అధికారులను ఆదేశించారు.

ఉపాధిహామీ పనులు ప్రాధాన్యంగా పూర్తి చేయాలి

సిరిసిల్ల, మే 20 (ఆంధ్రజ్యోతి) : ఉపాధిహామీ పనులు అత్యంత ప్రాధాన్యంగా పూర్తిచేయాలని పంచాయతీరాజ్‌ ప్రత్యేక ప్రధానకార్యదర్శి దాన కిషోర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం నుంచి సెర్ఫ్‌ ఈవో దివ్యతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి నరేగా పనులు, చేయూత పెన్షన్‌ సర్వే పురోగతిని సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా పంచాయతీ రాజ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్‌ మాట్లాడుతూ..నరేగా కింద వేజ్‌కంపోనెంట్‌, మెటీ రియల్‌ కంపోనెంట్‌ పనులను వేగవంతం చేయాలని, ప్రణాళికలో ఉన్న అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్‌ చేయాలని ఆదేశించారు. నరేగా పథకం జూన్‌ 30వ తేదీ వరకు మాత్రమే కొనసా గుతుందని, జూలై 1 నుంచి కొత్తగా వీబీజీ రామ్‌జీ పథకం అమల్లోకి రానుందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 15లక్షల మంది కార్మికులు నరేగా పనుల్లో పాల్గొం టుండగా, వెంటనే ఆ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని ఆదేశించారు. ప్రతి రోజు పనుల కోసం ముందురోజే కార్మికుల సమీకరణ చేపట్టాలని, పనులు గ్రామ హాబిటేషన్‌ పరిధిలోనే ఉండేలా చూడాలని, ఉదయం 5.30 గంటలకే పనులు ప్రారంభించి, ప్రధాన పనులను ఉదయం 10.30 గంటలలోపు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాబో యే 40 రోజుల పాటు ఎంపీడీవోలు నరేగా పనులపైనే దృష్టి సారించి వేగవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అసైన్డ్‌ భూముల్లో కూడా ఫామ్‌పాండ్‌ల నిర్మాణ పనులను చేపట్టి రైతులకు ఉపయోగకరంగా మలచాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రి సుమారు 8 వేల వీవో భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారని వెల్లడించారు. అంగన్‌ వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాలల ప్రహరీలు, మహిళా సంఘాల భవనాలు వంటి నిర్మాణాలను నరేగా కింద ప్రణాళి క చేయవచ్చని తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్‌ కాం పోనెంట్‌కు రూ 408 కోట్లకు పరిపాలనా అనుమతులు లభించగా, ఇప్పటివరకు రూ65కోట్ల మేర మాత్రమే క్లెయిమ్‌ చేయబడిందని, ఇంకా రూ 343 కోట్ల బ్యాలెన్స్‌ నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాబోయే 40 రోజుల్లో ఈ నిధులను ప్రాధాన్యతగా బుక్‌ చేసి పూర్తి స్థాయిలో వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 20 పనులను గుర్తించా లని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఈ ప్రక్రియలో భాగస్వా మ్యం చేయాలని సూచించారు. అర్హులైన వారందరికీ వెంటనే కొత్త జాబ్‌కార్డులు జారీచేయాలని తెలిపారు.పెన్షన్‌ పొందుతున్న లబ్ధిదారు లందరికీ లైవ్‌ అథెంటికేషన్‌ ప్రక్రియ చేపడుతున్నామని పేర్కొన్నారు. స్త్రీనిధి రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. స్త్రీ నిధి రుణాల చెల్లింపులు, ఎన్‌పీఏల నియంత్రణపై ప్రతి నెల జిల్లా కలె క్టర్లు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.

కలెక్టర్‌కు అభినందనలు

మహిళా సమాఖ్య భవనాల పురోగతిలో ప్రతిభ చూపుతున్న జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ను రాష్ట్ర అధికారులు అభినందించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలుకు సంబంధించి కొత్త జీవో విడుద లైందని తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం అమలుకు ఎంపీడీవోలే అధికా రులని పేర్కొన్నారు. కుటుంబ పోషకుడిని కోల్పోయిన పేద కుటుంబాల కు ఈపథకం కింద రూ20వేల ఆర్థిక సాయం అందజేస్తారని తెలిపారు. ఇతర బీమా పథకాల ప్రయోజనం లేని ప్రతి అర్హత కుటుంబానికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫ రెన్స్‌లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్‌, మునిసిప ల్‌ కమిషనర్లు ఖదీర్‌ పాషా, లోకేష్‌, ఎంపీడీఓలు, ఏపీఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 12:52 AM