Share News

కలెక్టరేట్‌లో ఉద్యోగుల నిరసన

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:15 AM

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి, వారికి రావాల్సిన పెండింగ్‌ బిల్లులతోపాటు పీఆర్సీ, ఈహెచ్‌ఎస్‌లను సవరించాలంటూ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ ఎలు సాని ప్రవీణ్‌కుమార్‌, కో-చైర్మన్‌ సమరసేన్‌లు డిమాండ్‌చేశారు.

కలెక్టరేట్‌లో ఉద్యోగుల నిరసన

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి, వారికి రావాల్సిన పెండింగ్‌ బిల్లులతోపాటు పీఆర్సీ, ఈహెచ్‌ఎస్‌లను సవరించాలంటూ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ ఎలు సాని ప్రవీణ్‌కుమార్‌, కో-చైర్మన్‌ సమరసేన్‌లు డిమాండ్‌చేశారు. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండవ పీఅర్‌సీని వెంటనే అమలు చేసి పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యాపకుల ఫోరం అధ్యక్షుడు మధుసూ ధన్‌రెడ్డి, టీఎన్‌జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సుదర్శన్‌, టీజీవో కార్యదర్శి సయ్యద్‌జబీ, శ్రీకాంత్‌, రియాజ్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి..

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం ప రిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షు డు ఎంఏ ఖాద్రీ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవిలు డిమాండ్‌ చేశా రు. రాష్ట్ర టీజీఈ జేఏసీ పిలుపు మేరకు సిరిసిల్లఅర్బన్‌ పరిధిలోని చంద్రంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్లబాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు చేపట్టా రు. ప్రధానోపాధ్యాయురాలు తన్నీరు పద్మజ, ఉపాధ్యాయులు వడ్యారపు మధు సూధన్‌, అనిల్‌, వేముల అంజలి, మంజు, రమ, వెంగళ పల్లవి పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 12:15 AM