ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:45 PM
విద్యుత్ రంగంలో పని చేసే పత్రి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రత పరికరాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎన్‌పీడీసీఎల్ సీఈ (అపరేషన్) బుస్సా అశోక్ అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ రంగంలో పని చేసే పత్రి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రత పరికరాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎన్‌పీడీసీఎల్ సీఈ (అపరేషన్) బుస్సా అశోక్ అదేశించారు. సిరిసిల్ల సెస్ పరిధిలోని అన్ని విద్యుత్ సబ్‌స్టేషన్లలో శనివారం ఎస్‌పీడీసీఎల్ ఆపరేషన్ సీఈ బుస్సా అశోక్ పర్యటించారు. విద్యుత్ సబ్‌స్టేషన్లలో పని చేస్తున్న వారికి రక్షణ కిట్‌లను వినియోగించడం వలన జరిగే లాభనష్టాలపై అవగాహన కల్పించారు. విద్యుత్ భద్రత, వినియోగదారుల సేవలు, వ్యవస్థ మెరు గుదలపై సిబ్బందితో పాటు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశా రు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు డీఎం అపరేషన్, మెయింట నెన్స్ సిబ్బందికి భద్రతపై అవగహన కల్పించేందుకు ప్రత్యేకంగా పెప్ టాక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అశోక్ తెలిపారు. పట్టణంలోని శివనగర్ విద్యుత్‌సబ్ స్టేషన్‌లో డివిజనల్ ఇంజనీర్ అంజయ్య ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో పాటు అధికారులు హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్‌రాడ్ వంటి భద్రత పరికరాలు తప్పసరిగా ధరించాలని, అవి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయరాదని హెచ్చరించారు. ప్రాణం అమూల్యమైందని ఉద్యోగుల భద్రత తమ అగ్ర ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం సెక్షన్ కార్యాలయాల్లో పెప్‌టాక్ నిర్వహిస్తూ సిబ్బందికి భద్రతపై నిరంతంర అవగాహన కల్పించాలన్నారు. ప్రతిఉద్యోగి జీవితం విలువై నదని భద్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. వినియోగదా రులకు నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను సరఫరా అందించడంలో ఆప రేష్ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వినియోగదారుల తో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారి సంతృప్తే ప్రధాన లక్ష్యంగా సేవలు అందించాలని సూచించారు. విద్యుత్‌సేవల్లో మార్పులు తీసుక వచ్చే దిశగా సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.
పొలంబాట- ప్రజాబాటతో రైతులకు చేరువ..
సిరిసిల్ల పరిధిలో రైతుల సమస్యలను ప్రతక్ష్యంగా తెలుసుకుని పరి ష్కరించేందుక పొలంబాట- ప్రజా బాట కార్యక్రమాన్ని ఎస్‌ఈ బిక్షపతి నాయకత్వంలో విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, వినియోగదారులు పాల్గొని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకరావాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రమాదకరంగా ఉన్న లూజ్‌లైన్‌లు, వంగిన స్థంబాలు, తక్కువ ఎత్తు లో ఉన్న ట్రాన్స్‌ఫ్మార్‌లు వంట సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి తక్షణమే సరిచేస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారులు ఎట్టి పరిస్థి తుల్లోనూ స్వయంగా విద్యుత్ పనులు చేయకూడదని ఏసమస్య ఉన్నా వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓవర్‌లోడ్ ఫీడర్‌లు ఉంటే వెంటనే లోడ్ బదలాయింపులు చేపట్టాల న్నారు. అవసరమైన చోట బ్రేకర్లు ఏర్పాటుచేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగు పరించేందుకు సాంకేతిక చర్యలు తీసుకోవాలని అవసరాన్ని బట్టి పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సమార్థ్యాన్ని పెం చాలని అధికారులకు సూచించారు. విద్యుత్ వ్యవస్థను మరింత సమ ర్థవంతంగా సురక్షింతంగా వినియోగదారులకు అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా ఎన్‌పీడీసీఎల్ కట్టుబడి ఉందని అఽశోక్ తెలిపారు. ఈ కార్యక్ర మంలో డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.