అర్హులైన బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలి
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:13 AM
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను 14 ఏళ్లు నిండిన బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సాజిదా అతహరి అన్నారు.
హుజూరాబాద్ రూరల్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను 14 ఏళ్లు నిండిన బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సాజిదా అతహరి అన్నారు. హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు అధ్యక్షతన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌మీద ఓరియంటేషన్, కోఆర్డినేషన్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాజిదా అతహరి మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక నివారణ మందు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అన్నారు. హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో మూడు నెలల పాటు ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు హెచ్‌వీపీ వ్యాక్సిన్ వేస్తారన్నారు. 14, 15 సంవత్సరాల బాలికలు తమ ఆధార్‌కార్డు తీసుకువచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణరెడ్డి, వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ పాల్గొన్నారు.
ఫ జమ్మికుంటలో..
జమ్మికుంట: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 14సంవత్సరాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సాజీదా అతహరి అన్నారు. శుక్రవారం జమ్మికుంటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌ిపీవీ వ్యాక్సినేషన్ మీద ఓరియంటేషన్, కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాజీదా మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి మూడు నెలల పాటు వ్యాక్సిన్ వేస్తారని, అర్హులైన బాలికలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సూపరిండెంట్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు, డాక్టర్ బి రమేష్, వైద్యాధికారులు డాక్టర్ వరుణ, డాక్టర్ తులసీదాస్ పాల్గొన్నారు.