విద్యుత్ వినియోగదారులు భద్రతా నియమాలు పాటించాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:33 AM
విద్యుత్ వినియోగ దారులు భద్రతా నియమాలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారి రాంజీ నాయక్ అన్నారు.
జగిత్యాల అగ్రికల్చర్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగ దారులు భద్రతా నియమాలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారి రాంజీ నాయక్ అన్నారు. పట్టణం లోని స్థానిక తహశీల్‌చౌరస్తా వద్ద ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రమాదాల నివారణపై ఏఈ సంతోష్, రాంజీ నాయక్‌లు మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ వైర్లను వాడాలన్నారు. వినియోగ దారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే సంస్థ లక్ష్యమని అన్నారు. వినియోగదారులు విద్యుత్ పరంగా వార్డులో గానీ, ఇంటిలో గాని అంతరాయం కలిగితే విద్యుత్ సంస్థ టోల్‌ఫ్రీ నెంబర్ 1912ను సంప్రదిస్తే త్వరతితగతిన సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది ప్రమోద్, ప్రకాష్, ఉదయ్, శ్రీనివాస్, నవీన్, ఫర్వేజ్ తో పాటు వినియోగదారులు పాల్గొన్నారు.
ఫపట్టణంలోని స్థానిక వాణీనగర్ టౌన్-3 పరిధిలో గురువారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ సంస్థ ముందుకు సాగుతుందని ఏఈ ప్రవీణ్ అన్నారు. విద్యుత్ అంత రాయం లేకుండా తమ సిబ్బంది కృషిచేస్తున్నారని తెలిపారు.
ఫపట్టణంలోని టౌన్ 1 సెక్షన్ పరిధిలోని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పురాణిపేటలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిం చారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై ఏఈ సతీష్ వినియోగ దారులకు అవగాహన కల్పించారు. విద్యుత్ సమస్యల పరిష్కా రానికి తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.