ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:13 AM
మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీని, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు.
హుజూరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీని, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చెక్‌లిస్టు ఆధారంగా అవసరమైన సామాగ్రి అందించాలన్నారు. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారద్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలన్నారు. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేష్‌బాబు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తహసీల్దార్ నరేందర్ పాల్గొన్నారు.