Share News

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:12 AM

మున్సిపల్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలాసత్పతి ఎన్నికల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్‌ సాధారణ ఎన్నికలు -2026లో భాగంగా ఎస్సారార్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన చొప్పదండి మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ పమేలాసత్పతి మంగళవారం సందర్శించారు.

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
చొప్పదండి ఎన్నికల డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

కరీంనగర్‌ టౌన్‌/చొప్పదండి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలాసత్పతి ఎన్నికల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్‌ సాధారణ ఎన్నికలు -2026లో భాగంగా ఎస్సారార్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన చొప్పదండి మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ పమేలాసత్పతి మంగళవారం సందర్శించారు. పోలింగ్‌ నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్‌లిస్ట్‌ ప్రకారం తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే రూట్‌, మానిటరింగ్‌ అధికారులకు తెలపాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సామగ్రితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని, అధికారులు సూచించిన చోటే బస చేయాలని ఆదేశించారు. చొప్పదండిలో పోలింగ్‌ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. నోడల్‌ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఓటర్లు స్వేచ్చగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు సమక్షంలో పోలింగ్‌ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించి సీల్‌ చేసిన తర్వాత ఉదయం ఏడు గంటలకు కచ్చితంగా పోలింగ్‌ ప్రారంభించాలని ఆదేశించారు.

ఫ ఐదు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

- నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌

కార్పొరేషన్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ తెలిపారు. మంగళవారం పోలింగ్‌ సామగ్రి, పంపిణీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. ఎస్సారార్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌, ఆర్డీవో మహేశ్వర్‌ పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 66 డివిజన్లలోని 3,40,580 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 477 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఐదు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందన్నారు. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్న ఓటర్లందరికి ఓటు వేసేందుకు అనుమతించాలని సూచించారు. వందశాతం ఓటింగ్‌ ప్రక్రియ జరిగేలా ఎన్నికల సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఓటింగ్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది బ్యాలెట్‌ బాక్స్‌లను బందోబస్తు మధ్య ఎస్సారార్‌ కళాశాలకు తరలించి స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరుస్తారన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 12:12 AM