ఎన్నికల నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:22 AM
ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని ఏసీపీ వెంకటస్వామి పేర్కొన్నారు.
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని ఏసీపీ వెంకటస్వామి పేర్కొన్నారు. కరీంనగర్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుస్సైనీపురా, ఖాన్‌పురా, హౌసింగ్‌బోర్డు కాలనీ ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటస్వామి మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ప్రజలకు, స్థానిక ప్రతినిధులకు వివరించారు. ఎన్నికల నిబంధనలను పాటించడం, శాంతి భద్రతలను కాపాడటం, ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని ఏసీపీ సూచించారు. ఈ ప్లాగ్‌మార్చ్‌లో త్రీటౌన్ సీఐ జి తిరుమల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.