బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:19 AM
ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు రిటర్నింగ్ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు రిటర్నింగ్ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆర్‌వోలు, ఏఆరోవోలను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, ఏఆరోవోలు, అధికారులు, ఎన్నికల సిబ్బందితో ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లతో పాటు 7,8,9 తేదీల్లో నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తదితరుల అంశాలపై చర్చించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు వారి డిక్లరేషన్ ఫారంను పరిశీలన చేసి ఓటుకు అనుమతించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ న్యూభవనంలో 5 రూంలు సిద్ధంచేసి పోలింగ్‌స్టేషన్ ప్రకారం మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. డివిజన్ల ప్రకారం ఆర్‌వోలు, ప్రింటైన బ్యాలెట్‌ను డిస్ట్రిబ్యూషన్‌చేసే వరకు తమ ఆధీనంలో ఉంచుకొని బ్యాలెట్ పేపర్‌ను, మరోసారి వెరిఫికేషన్ చేయాలని అన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా జాగ్రత్తగా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, వేణుమాధవ్, ఖాదర్, ఎస్‌ఈ రాజ్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్‌కుమార్, ఎంహెచ్‌వో సుమన్, డిసిపి బషీరొద్దీన్, ఏసీపీలు వేణు, శ్రీధర్, రిటర్నింగ్ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
ఫ డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశా లను సందర్శించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కౌంటింగ్, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సుల కోసం స్ట్రాంగ్ 1,2లను సిద్ధం చేయాలని, కౌంటింగ్‌కు టేబుల్స్ ఆరేంజ్‌మెంట్ చేయాలని అన్నారు. బ్యాలెట్ కౌంటింగ్‌కు కావలసిన వస్తువలును సమకూర్చాలని అన్నారు. మెటీరియల్ డిస్ర్టి బ్యూషన్ కోసం కౌంటర్లు, టేబుల్స్ ఏర్పాటు చేసి సామగ్రి పంపిణీ చేసేందుకు అనువుగా వసతి సౌకర్యాలను సమకూర్చాలని చెప్పారు.