Share News

ఎన్నికల విధులు నిబంధనలకు లోబడి నిర్వర్తించాలి

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:24 AM

మున్సిపల్‌ ఎన్నికల విధులు నిబంధనలకు లోబడి నిర్వర్తించాలని కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎన్నికల విధులు నిబంధనలకు లోబడి నిర్వర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

- కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల విధులు నిబంధనలకు లోబడి నిర్వర్తించాలని కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలోని మీటింగ్‌ హాల్‌లో నిర్వహించిన మున్సిపల్‌ మున్సిపల్‌ ఆర్వోలు, ఏఆర్‌వోల శిక్షణ కార్యక్రమాల్లో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పాల్గొని ప్రసంగించారు. ఆర్వో, ఏఅర్వోలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో ఎన్నికల నిబంధనలు అనుసరించి నిర్వహించే బాధ్యత ఆర్వో, ఏఆర్వోల పైన ఉందని తెలిపారు. ఎన్నికల ముందు రోజు ఎన్నికల సామగ్రి సేకరణ, పూర్తి సావమగ్రి ఉందో, లేదో, ఎలా సరిచూసుకోవడం, ఓటర్‌ జాబితా, బ్యాలెట్‌ పేపర్స్‌ చెక్‌ చేసుకోవడం, బ్యాలెట్‌ బాక్స్‌లు ఎలా సీల్‌ చేయాలి, ఛాలెంజ్‌ ఓటు, టెండర్‌ ఓటు, బ్యాలెట్‌ బ్యాక్‌ సీలింగ్‌ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఓట్ల కౌంటింగ్‌, మున్సిపల్‌ చైర్మన, వైస్‌చైర్మన ఎన్నిక నిర్వహణ, చైర్మన, వైస్‌చైర్మన నియామక పత్రాలు ఇవ్వడం తదితర అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆర్వో, ఏఆర్వోల కార్యాచరణ, విధులు, బాధ్యతలు తీసుకోవలిసిన జాగ్రత్తలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన ద్వారా వివరించారు. మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు సమన్వయం చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి రాజగౌడ్‌, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు జివాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, మాస్టర్‌ ట్రైనర్స్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:24 AM