Share News

మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:13 AM

వేములవాడ మహా శివరాత్రి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించి.. విజయవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్‌పర్సన్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

సిరిసిల్ల, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ మహా శివరాత్రి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించి.. విజయవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్‌పర్సన్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. ఈనెల 14,15,16 తేదీల్లో మహాశివరాత్రి జాతర సందర్భంగా అన్ని శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయా ల సముదాయంనుంచి గురువారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వేములవాడలో భీమేశ్వర ఆలయంలో మహా శివరాత్రి జాతర సందర్భంగా భక్తులు స్వామి వారి దర్శనాన్ని సౌకర్యంగా చేసుకునేలా తుది దశ ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్‌లు సిద్ధంచేయాలని ఆర్టీసీ అధి కారులకు సూచించారు. జడ్పీ డిప్యూటీ సీఈవో, వేముల వాడ మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్తంగా ఆలయ పరిసరాలు, పార్కింగ్‌ స్థలాలు, క్యూలైన్లు ఇతర చోట్ల మూడు షిఫ్టుల్లో సిబ్బంది ఉండే లా చూడాలని ఆదేశించారు. జాతరకు ముందు నుంచి తరువాత మూడు రోజుల వరకు పారిశుధ్య సేవలు అందించాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ అధి కారి ఆద్వర్యంలో బస్టాండ్‌, పార్కింగ్‌ స్థలాలు, ఇతర చోట్ల పూర్తి వివరాలతో హెల్ప్‌ డెస్క్‌లు సిబ్బంది అందు బాటులో పెట్టాలని, ప్రతిచోట అన్ని వివరాలతో కూడిన సైన్‌బోర్డులు పెట్టించాలని తెలిపారు. ఆలయంలోని క్యూలైన్లు, పార్కింగ్‌ స్థలాల వద్ద, బస్టాండ్లలో తాగు నీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సెస్‌ అధికారులు భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం, ఇతర చోట్ల 24గంటల పాటు విద్యుత్‌ సరఫ రా ఉండేలా చూడాలని, ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు కూడా చేసుకోవాలని, అధికారులు, సిబ్బంది ఉండాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖా ఆద్వర్యంలో భీమన్న ఆల యం, ప్రసాదం కౌంటర్‌, పార్కింగ్‌ స్థలాలు ఇతర చోట్ల వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్‌లతో సిద్ధంగా ఉండాలని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా, అందుబాటులో ఉం డాలని ఆదేశించారు. అగ్ని మాపక శాఖా అధికారులు ప్రధాన ఆలయాల్లో ఫైర్‌ సేఫ్టీ పరికరాలు చెక్‌ చేయాల ని, వారి సిబ్బంది గుడి ఆవరణలో జాతర సమయంలో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులు భక్తులకు అందించే ప్రసాదం, ఇతర ఆహార పదార్థాల ను పరిశీలించాలని ఆదేశించారు. క్యూ లైన్లు, వీఐపీలు, కళ్యాణ కట్ట, ఇతరచోట్ల రద్దీ నియంత్రణ, దర్శనం పూర్తి చేసేందుకు జిల్లా స్థాయి అధికారులను నియమించా మని, వారు ఆయా ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలి పారు. కోడెల నిర్వహణ, సంరక్షణ జిల్లా పశు సంవర్ధక శాఖ, ఆలయ అధికారులు సమన్వయంతో చూసుకో వాలని ఆదేశించారు.జాతర ఆవరణలో ప్లాస్టిక్‌ వస్తువు లు వినియోగించకుండా చూడాలని సూచించారు. వృద్ధు లు, దివ్యాంగులకు సహాయం కోసం వీల్‌ చైర్లు వలంటీ ర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతర విధుల కు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి కావాల్సిన గదు లు, ఆహారం,ఇతర సదుపాయాలు వేములవాడ ఆర్డీవో, ఆలయ అధికారులు చూసుకోవాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో విధులు నిర్వ ర్తించాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా దర్శనం, వసతులలో ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేసారు. మీడియా సెంటర్‌ ఏర్పాటు చేయాలని, వీఐపీ, వీవీఐపీల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచిం చారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఎస్పీ మహేష్‌ బి గితే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబా యి, ఆలయ ఈవో రమాదేవి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 12:13 AM