Share News

స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:28 AM

భారత స్వాతంత్య్ర దినోత్స వ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అదేశించారు.

స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : భారత స్వాతంత్య్ర దినోత్స వ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అదేశించారు. సిరి సిల్ల జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్రవేడుకల ఏర్పాట్లను బుధవారం జిల్లా అధికారులతో కలిసి అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నామన్నారు. స్టేజీ, ప్రొటోకాల్‌ ప్రకారం సీటింగ్‌ ఏర్పాట్లు, సౌండ్‌సిస్టం, కుర్చీలు, తాగు నీరు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, తహసీ ల్దార్‌ మహేష్‌కుమార్‌రావు, కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 12:28 AM