Share News

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:19 AM

పలు అభివృద్ధి పనుల శంకు స్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నార ని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

సిరిసిల్ల, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి) : పలు అభివృద్ధి పనుల శంకు స్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నార ని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. ఈనెల 30న సీఎం రేవంత్‌రెడ్డి రాక నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బీ గితే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, వివిధ శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అలాగే సిరిసిల్ల రగుడు బైపాస్‌ రోడ్డు వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్‌మీటింగ్‌ నిర్వహించనున్నారని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్‌ అధికారులు ట్రాఫిక్‌, బందోబస్తు, భద్రతా చర్యలు ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవె న్యూ అధికారి జయశ్రీ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌ బీ కుమారి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:19 AM