ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:01 AM
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థి తులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తూ కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థి తులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తూ కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ సచివాలయం నుంచి వివిధ శాఖల ఉన్నాతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు సూపర్ ఎల్‌నినో ప్రభావం, వర్షా భావనివారణ చర్యలు, వ్య వసాయ ప్రణాళికలు, తాగునీటి నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించారు. ఈసంద ర్భంగా సీఎస్ మాట్లాడు తూ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమో దయ్యే అవకాశం ఉన్నందున అధికారుల అప్ర మత్తంగా ఉండి శాఖ వారీగా ముందస్తు చర్య లు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని తక్కువనీరు అవసరమ్యే పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అవసరమైన విత్తనా లు, సాంకేతిక సూచనలు అందుబాటులో ఉంచి రైతులకు అన్ని విధాలుగా సహకరించాలన్నారు. జిల్లాలోని ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉం చుకుని శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని, తాగునీటి సరఫరా, వ్యవసా యం పశుసంవర్ధక, విద్యుత్, వైద్య, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జీ మంత్రుల ప్రత్యేక అధికారులతో నిర్వహించే సమీక్షలకు అన్ని శాఖ ల అధికారులు సూపర్ ఎల్‌నినో పరిస్థితుల, వర్షపాతం అంచనాలు, వ్యవసాయ పరిస్ధితులు, తాగునీటి నిర్వహణ శాఖల వారీ ప్రణాళికలపై సమగ్ర నివేదికలతో హాజరుకావాలని ఆదేశిం చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసచారి, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా వైద్యాధికారి ఏజెంలా అల్ర్పేడ్, జిల్లా నీటి పారుదల శాఖ ఈఈ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.