బాలల హక్కుల పరిరక్షణకు కృషి
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:14 AM
బాలల హక్కుల పరిర క్షణకు కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పీ లక్ష్మణాచారి కోరారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : బాలల హక్కుల పరిర క్షణకు కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పీ లక్ష్మణాచారి కోరారు. బాలల దినోత్సవాన్ని పురస్కరిం చుకుని సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూర్ శివారు ఇప్పల్లపల్లెలోని మహాత్మా జ్యోతిబా ఫూలే, బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాల విద్యార్థులకు న్యాయ అవ గాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి మాట్లాడుతూ బాలలందరికీ విద్య, ఆరోగ్యం, రక్షణ, గౌరవప్రదమైన జీవనం పొందే హక్కులు ఉన్నా యన్నారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, బాల కార్మికత్వం, బాల్య వివాహాలు వంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులను, న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్ యాస్మిన్, సిరిసిల్ల ఎస్‌ఐ అనిల్‌కుమార్, లోక్‌అదాలత్ సభ్యులు, న్యాయవాదులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, అనూష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.