ముత్యాల పోచమ్మ ఆలయాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:24 AM
మండలంలోని అనంతగిరి గ్రామంలోని ముత్యాల పోచమ్మ ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని అనంతగిరి గ్రామంలోని ముత్యాల పోచమ్మ ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. పోచమ్మతల్లి ఆలయానికి శుక్రవారం మంత్రి రాగా పూజారులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొనసాగుతోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అను గుణంగా సీఎం రేవంత్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుపుతున్నారని అన్నారు. ముత్యాల పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతిరావు, సర్పంచ్ నవీన్‌కు మార్, ఆలయ కమిటీ చైర్మన్ కొలపురి అంతగిరి, ప్యాక్స్ డైరెక్టర్ ఒగ్గు రమేష్, నాయకులు పాల్గొన్నారు.