మౌలిక వసతుల కల్పనకు కృషి
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:59 PM
పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని మున్సి పల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని మున్సి పల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. ఆదివారం సిరిసిల్ల మున్సి పల్ పరిధిలోని 31వ వార్డులో సీసీ రోడ్డు, మురికి కాలువ నిర్మాణం కోసం చైర్‌పర్సన్ కళాచక్రపాణి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ స్థానిక 31వ వార్డులో సీసీ రోడ్డు, మురికి కాలువ సమస్యను కౌన్సిలర్ తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. సీసీ రోడ్డు, మురికి కాలువ నిర్మాణం కోసం మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.3లక్షలను కేటాయిం చామని పేర్కొన్నారు. నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు. కాంట్రాక్టర్ సీసీ రోడ్డు, మురికికాలుల నిర్మాణం పనులను నాణ్యత ప్రమా ణాలతో త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు ఎలుక వెంకటేశం, బత్తు ల రమేష్, ఎలుక వెంకటేశం, మాజీ కౌన్సిలర్లు గుండ్లపెల్లి పూర్ణచందర్, గెం ట్యాల శ్రీనివాస్, పాల్గొన్నారు.