మెరుగైన వలస విధానాల అమలుకు కృషి
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:25 AM
తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన కార్మికుల కోసం మెరుగైన వలస విధానాలకు కృషి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభు త్వ విప్, ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన కార్మికుల కోసం మెరుగైన వలస విధానాలకు కృషి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభు త్వ విప్, ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలాలోని ఇండియన్ ఎంబసీని కమిటీ సభ్యులు బుధవారం సందర్శించారు. మనీలాలోని కమిషన్ ఆన్ ఫిలిప్పీ న్స్ ఓవర్సీస్ ఉన్నతాధికారులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ వలస విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫిలి ప్పీన్స్ దేశ వలస విధానాన్ని ఆ దేశ ఉన్నత అధికారులు పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ సభ్యులు వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వలస విధానాన్ని అమలుచేస్తున్న ఫిలిప్పీన్స్ దేశంలో అమ లులో విధివిధానాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇదే తరహాలో మెరుగైన వలస విధానాన్ని గల్ఫ్ కార్మికుల కోసం అమలు చేసేందుకు కృషి చేస్తా మని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు.