క్షయరహిత గ్రామాలుగా మార్చేందుకు కృషి
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:04 AM
క్షయ రహిత గ్రామాలుగా మార్చేందుకు వైద్యసిబ్బంది పక్కా కార్యచరణప్రణాళికలతో కృషి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : క్షయ రహిత గ్రామాలుగా మార్చేందుకు వైద్యసిబ్బంది పక్కా కార్యచరణప్రణాళికలతో కృషి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా సర్పంచ్‌లు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరి మ అగ్రవాల్ క్షయ లక్షణాలు, వైద్యపరీక్షలు, మందులు, పోషకాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం కింద ఎంపికైన 20 గ్రామ పంచాయతీల సర్పంచులు, వైద్యసిబ్బందికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందించి అభినందించారు. మిగతా వైద్యులు, సిబ్బంది వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. 20 మంది క్షయ బాధితులకు పోషకాహారం కిట్లను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ క్షయరహిత గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు వైద్య సిబ్బంది పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు,సిబ్బంది కృషి చేయాలని పిలు పునిచ్చారు. క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షయ లక్ష ణాలు ఉన్నవారిని గుర్తించాలని, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చే యించాలని పేర్కొన్నారు. టీబీ పేషంట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్యం, మందులు, ఆర్థిక సహాయం ఇప్పించాలని ఆదేశించారు. పూర్తిగా నయం అయ్యేవరకు క్షయ బాధి తులపై పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
ఎంపిక అయిన గ్రామాలు ఇవే..
బోయినపల్లి మండలంలో ని రామన్నపేట, దేశాయిపల్లి, శాభాష్‌పల్లి, ఇల్లంతకుంట మండలంలోని కిష్టారావుప ల్లె, ఆరెపల్లి, గంభీరావుపేట మండలంలోని హీరాలాల్ తండా, పొన్నాలపల్లి, కోనరా వుపేట మండలం గొల్లపల్లి, శివంగాలపల్లి, మర్తన్న పేట, ముస్తాబాద్ మండలం గోపా లపల్లి, రుద్రంగి మండలం రూప్లానాయక్ తండా, సర్పం చ్‌తండా, తంగళ్ళపల్లి మండ లం పాపయ్యపల్లి, వీర్నపల్లి మండలం బాబాయిచెరువు తండా, బావుసింగ్‌నాయక్ తండా, ఎర్రగడ్డతండా, జవ హర్‌లాల్‌నాయక్ తండా, వేములవాడ రూరల్ మండ లం అచ్చన్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్, వైద్యులు, సర్పంచులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.