మార్కెట్ కమిటీల బలోపేతానికి కృషి
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:13 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వ ర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను బలోపేతం చేసేం దుకు కృషి చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
మెట్‌పల్లి రూరల్, అక్టోబరు 7 (ఆంధ్ర జ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వ ర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను బలోపేతం చేసేం దుకు కృషి చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం మెట్‌పల్లి వ్యవ సాయ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మిం చిన కార్యాలయ భవనాన్ని ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్‌తో పాటు వెలమ సంక్షేమ కార్పొరేషన్‌చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్‌రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ రైతుల ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం ఢిల్లీలో ఎస్‌ఐ ఆర్‌కు వ్యతిరే కంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలను అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయ డంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. గతం లో ఈవీఎంల ద్వారా నేను ఓటమి పాల య్యానని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్టుచేయడం ప్రజాస్వామ్యంలో నిరసన తెలి పే హక్కును హరించడమేనని విమర్శిం చారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతపై రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభు త్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశం పై కేంద్రమంత్రి బండి సంజ య్, నిజామా బాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌లు ఏవిధంగా స్పందిస్తారని ప్రశ్నించారు. ఈ కార్య క్రమంలో మెట్‌పల్లి ఎల్‌ఎస్‌పీఎస్ చైర్మన్ కొమి రెడ్డి తిరుపతిరెడ్డి, తిప్పిరెడ్డి అంజిరెడ్డి, కొమ్ముల సంతోష్‌రెడ్డి, తహసీల్దార్ ముఫ్తార్‌అలీ, ఆర్ కాంతయ్య, డైరెక్టర్లు, నాయ కులు, అదికారులు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు
పరిష్కరించాలని వినతి
మండలంలోని గ్రామపంచా యతీల సమ స్యను పరిష్కరిం చి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మెట్‌పల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కడారి రాజేష్ కోరారు. బుధవారం మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు సర్పంచులు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. సర్పంచుఫోరం అధ్య క్షుడు కడారిరాజేష్ మాట్లాడుతూ మండలం లోని పంచాయతీల్లో నిధుల కొరతతో పాటు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబం ధించిన పెండింగ్ బిల్లులు, రెవెన్యూ, పరిపాల నాసమస్యలు ఉన్నాయని, 15 రోజుల్లోగా సర్పం చుల ఫోరం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారా నికి చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేసి వినతిపత్రం అందజేయడం జరగింద న్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సర్పంచులు గంటా రాజేశ్వర్‌యాదవ్, సాయ గౌడ్, గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.