Share News

సిరిసిల్లలో బీజేపీ బలోపేతానికి కృషి

ABN , Publish Date - May 08 , 2026 | 12:01 AM

సిరిసిల్లలో బీజేపీ అంటే ప్రజల్లో అభిమానం ఉందని అయి తే గ్రూప్‌ రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు పార్టీకి దూరమయ్యో పరిస్థితి రాకముందే గ్రూపు రాజకీయాలను వీడి ఐక్యంగా పార్టీ కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కోరారు.

సిరిసిల్లలో బీజేపీ బలోపేతానికి కృషి

సిరిసిల్ల అర్బన్‌, మే7(ఆంధ్రజ్యోతి) : సిరిసిల్లలో బీజేపీ అంటే ప్రజల్లో అభిమానం ఉందని అయి తే గ్రూప్‌ రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు పార్టీకి దూరమయ్యో పరిస్థితి రాకముందే గ్రూపు రాజకీయాలను వీడి ఐక్యంగా పార్టీ కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కోరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన జరిగింది. ఈ సమా వేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజ య్‌కుమార్‌ మాట్లాడుతూ కరీంనగర్‌లో ఎలాంటి గ్రూప్‌ రాజకీయాలు లేకపోవడంతోనే అక్కడి కార్పొరేషన్‌ ను బీజేపీ కైవసం చేసుకుందని అక్కడి నాయకత్వం మాదిరిగానే కలిసిమెలసి ఐక్యంగా పార్టీ బలోపేతం చేయాలన్నారు. ఇటీవల పలు రాష్ట్రాలల్లో జరిగిన అసెం బ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిందన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అంటే జనంలో వస్తున్న ప్రజాదరణ చూస్తూంటే తెలంగాణలో కాషాయం జెండా ఎగురుతుందనిపిస్తోందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ జరి గి నేటి ఏడాది పూర్తి చేసుకుందని ఈ సంఘటన జరి గిన తర్వాత ఈనెల 10న ప్రధాని నరేంద్రమోదీ తొలి సారి హైదరాబాద్‌కు వస్తున్నారన్నారు. మూడోసారి ప్ర ధాని పగ్గాలు చేపట్టిన తరువాత హైదరాబాద్‌ తొలిసారి రాబోతున్నారన్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి బీజే పీ కార్యకర్త స్వచ్ఛందంగా తరలిరావాలన్నారు. సిరిసిల్ల జిల్లా నుంచి వేలసంఖ్యలో జన సమీకరణ చేద్దాం. వేలాది సంఖ్యలో ప్రజలను పరేడ్‌ మైదానానికి తరలిచాలని కోరారు. బీజేపీ నాయకులంతా తమ అనుచరులు, టీంతో తప్పనిసరిగా తరలి రావాలని కోరారు. ప్రతి ఒక్కరూ మోదీ సభకు ఆహ్వానిస్తూ మీడియా, సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం నిర్వ హించాలిని కోరారు. మీ గ్రామాలు, వార్డులు, మండలాల పరిధిలో వాల్‌ రైటింగ్‌ రాయిచాల న్నారు. సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారికి తగిన రవాణా, భోజన సౌకర్యాలు కల్పించా లన్నారు. మోదీ సభ సక్సెస్‌తో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం తథ్యమనే సంకే తాలు పంపుదామన్నారు. ఈనెల 12 హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని రాజకీయాలకు అతీతంగా కరీంనగర్‌లో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రకు సైతం జిల్లా నుంచి భారీ ఎత్తున హిందువులంతా హాజరయ్యే లా చూడాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు చెన్నమనేని వికాష్‌రావు, జిల్లా ఇన్‌చార్జి గంగా డి మోహన్‌రెడ్డి, అల్లాడి రమేష్‌, ఎర్రం మహేష్‌, పోన్నా ల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2026 | 12:01 AM