Share News

అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:45 AM

అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి

వేములవాడ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని శాభాష్‌ పల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్ర మానికి హజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీని వాస్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల శారీరక, మానసిక అభివృ ద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో అవసరమన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించే కేంద్రాలుగా ఇవి ఎంతో కీలకమని తెలి పారు. కొత్త భవన నిర్మాణంతో పిల్లలకు సురక్షిత వాతావరణం, మెరుగైన సదు పాయాలు లభిస్తాయని చెప్పారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, పోషణ రంగాల్లో నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని వివరించారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, గుడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాభీవృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ చేరేలా కృషి చేయాలని కోరారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నూతన వస్త్రాలను అంద జేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఏటీ యాదవ్‌, మాజీ సర్పంచ్‌ పండుగ ప్రదీప్‌ కాంగ్రెస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:45 AM