Share News

అంగనవాడీ కేంద్రాల బలోపేతానికి కృషి

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:27 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగనవాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

అంగనవాడీ కేంద్రాల బలోపేతానికి కృషి
అంగనవాడీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

రాయికల్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగనవాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని కిష్టంపేట గ్రామంలో రూ.12 లక్షలతో అంగనవాడీ భవన నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల పిల్లలు ప్రైవేట్‌ ప్లే స్కూల్‌ తరహా మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన కల్పించే విధంగా అంగనవాడీల బలోపేతానికి చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వంలో కలిసి పనిచేసి గ్రామాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. రైతులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రైతు భరోసా నిధులు త్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఏక కాలంలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. విద్యతో సామాజిక అసమానతలు తొలగుతాయని అన్నారు. కార్యక్రమంలో కోల శ్రీనివాస్‌, ఏనుగు మల్లారెడ్డి, సర్పంచ అంజాగౌడ్‌, ఉప సర్పంచ చాంద్‌ పాషా, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బెజ్జంకి మోహన, ఎంపీడీవో చిరంజీవి, డీఈ మిలింద్‌, ఎంపీవో సుష్మా, ఏఈ ప్రసాద్‌, మాజీ సర్పంచ గోపి, రమేష్‌, మాజీ ఏఎంసీ డైరెక్టర్‌ తిరుపతి గౌడ్‌, మాజీ ఎంపీటీసీ గంగాధర్‌, నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌

రాయికల్‌ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థుల సీఎం కప్‌ కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరచగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అభినందించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆర్‌ అక్షయ్‌ సిల్వర్‌ మెడల్‌, పి కృష్ణ గోల్డ్‌ మెడల్‌ సాధించారు. కార్యక్రమంలో జిల్లా కిక్‌ బాక్సింగ్‌ అధ్యక్షుడు మోర సుమన, ప్రిన్సిపసాల్‌ వేణుగోపాల్‌ రావు, జిల్లా స్పోర్ట్స్‌ అధికారి రవి కుమార్‌, కోచ రామానుజన, సంతోష్‌ పాల్గొన్నారు.

వైద్యరంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి

జగిత్యాల అర్బన, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం జగిత్యాల మండలంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రం విద్యా, వైద్య రంగానికి కేంద్రంగా మారిందన్నారు, జిల్లా కేంద్రంలో 235 కోట్ల రూపాయలతో నాలుగు వందల పడకల నూతన ఆసుపత్రి నిర్మాణం పనులు జరుగుతోందని తెలిపారు. ఒకప్పుడు 15 మంది వైద్యులు మాత్రమే జగిత్యాలలో ఉండేవారని కాని ఇప్పుడు 334 మంది వైద్య పోస్టులు మంజూరు అయ్యాయన్నారు. అందులో 170 మందికి ఇప్పటికే పోస్టింగ్‌లు వచ్చాయని 135 మంది విధుల్లో చేరారని తెలిపారు. అంతేకాకుండా 365 మంది పారామెడికల్‌ పోస్ట్‌లు మంజూరు అయిట్లు తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచలు కట్ట రాజేందర్‌, బొలిశెట్టి గంగారెడ్డి, గొడిసెల గంగాధర్‌, మహేష్‌, చెరుకు జాన, నాయకులు ముస్కు ఎల్లారెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:27 AM