ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - May 20 , 2026 | 12:21 AM
ప్రజాసేవలో ముందుండి సమస్యల పరిష్కా రానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నా రు.
వేములవాడ రూరల్, మే 19 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసేవలో ముందుండి సమస్యల పరిష్కా రానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నా రు. కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల నూతన అధ్యక్షుడిగా నియామకమైన ఎదురుగట్ల గ్రామానికి చెందిన సోయినేని కరుణాకర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరుణాక ర్‌ను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలను సమ న్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కరుణా కర్‌కు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పలువు రు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
చందుర్తి : చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామక మైన గొట్టే ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియామకమైన చింతపం టి రామస్వామిలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళ వారం సన్మానించారు. ఈ సం దర్భంగా ఆది శ్రీనివాస్ మా ట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని బలోపే తం చేయడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, సర్పంచులు కట్కం మల్లేశం, బొజ్జ మల్లేశం, అవారి రమేష్, నా యకులు దూది శ్రీనివాసరెడ్డి, రవీందర్‌రెడ్డి, త్రిబువన్, సాయి, తదితరులు పాల్గొన్నారు.