Share News

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:58 AM

రైతులకు విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు పేర్కొన్నారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

ఇల్లంతకుంట, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : రైతులకు విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు పేర్కొన్నారు. మండలంలోని పొత్తూరు గ్రామంలో రోడ్డు వెంబడి ఉన్న విద్యుత్‌ ఫోల్స్‌ను ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న లూజ్‌వైర్లను సరిచేయడంతో పాటు రోడ్డు వెంబడి నెలకొన్న విద్యుత్‌ సమస్యలను త్వరలోనే తొలగిస్తామన్నారు. ఈసందర్భంగా సెస్‌చైర్మన్‌, డైరెక్టర్‌ మల్లుగారి రవీందర్‌రెడ్డిలను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీమాజీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, సర్పంచ్‌ పట్నం అశ్వినిశ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ బండారి నరేష్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ సిద్దం శ్రీనివాస్‌, వార్డుసభ్యులు తోడేటి సతీష్‌, దయ్యాల పావణిచంద్రమౌళి, నాయకులు పట్నం మహేందర్‌, సిద్దం సాగర్‌, గుంటి మధు, సాయికిరణ్‌, బీరయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 12:59 AM