సమస్యల సత్వర పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:01 AM
వేములవా డలో సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నా మని, అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని స్థా నిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.
వేములవాడ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): వేములవా డలో సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నా మని, అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని స్థా నిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వే ములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి, శాత్రాజుపల్లి గ్రామాల్లోని పలు కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం మంజూరైన ప్రొసీడింగ్ పత్రా లను గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. దానికి పట్ట ణంలో జరు గుతున్న అభివృద్ధి పనులు, పేద ప్రజలకు అందుతున్న సంక్షమ పథకాలే సాక్షమని తెలిపారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ నిలబడి వాటిని పరిష్కరిస్తూ ముందుకు పోతున్నామన్నారు. శాత్రాజుపల్లిలో సుమా రు రూ.1.43 కోట్లతో పేద ప్రజలకు ఉపయోగపడేలా ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావస్తుంద న్నారు. గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టడంతో చుట్టు పక్కల గ్రామా లకు శాత్రాజుపల్లి ఒక హబ్‌గా మారనుందని తెలిపారు. త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభం చేసుకుందామని చెప్పా రు. శాత్రాజుపల్లిలో సుమా రు రూ. 15 లక్షలతో ప్రధాన కూడలిలో నూతన జంక్షన్ సుందరీకరణ పనులు జరగు తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 45 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, వాటి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇంటి స్థలం లేని 11 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశామని, అంతే కాకుండా నాంపల్లి పట్టణానికి అధిక నిధులు మంజూరు చేశామని చెప్పారు. పలు కుల సంఘాలకు నిధులు మంజూరు చేశామని దేవాలయ ప్రహారీలకు నిధులు అందించామని వివరించారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశా మని, ఇండ్ల స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేసినట్లు తెలి పారు.
ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజలకు వరం..
ఇళ్లు లేని నిరు పేదలకు స్వంత ఇల్లు అందించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం చాలా అభినందనీయ మని, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పేద ప్రజలకు ఒక వరంలాంటిదని అన్నారు. పట్టణంలోని 11వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. లబ్ధిదా రులకు నూతన వస్ర్తాలు పంపిణీ చేశారు. లబ్ధిదారు లకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం స్వామి యాదవ్, కాశ శ్రీనివాస్, బొజ్జ భారతి, పీర్‌మ హ్మద్ తదితరులు ఉన్నారు.